Monday, December 23, 2024

అంధ యువతి హత్య కలిచివేసింది : పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్‌టిఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన యువతి దారుణ హత్యకు గురైన సంఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. అంధ యువతిని రాజు అనే రౌడీషీటర్ దారుణంగా హతమార్చిన విషయం తెలసిందే. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో జరిగిన ఈ ఘటన కలిచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లి అసాంఘీక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

సిఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో గతంలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు. తన నివాసం పరిసరాల పరిస్థితులనే ముఖ్యమంత్రి సమీక్షించుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. గంజాయికి కేరాఫ్ ఆడ్రస్‌గా ఆంద్రప్రదేశ్ మరిందన్నారు. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే తల్లి పెంపకంలోనే లోపం ఉందని ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారని వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వమిదని విమర్శించారు. కంటిచూపుకు నోచుకోని యువతిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News