Friday, January 3, 2025

రేవంత్ చేసింది రైటే!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సిఎం డైనమిక్ లీడర్ కిందిస్థాయి నుంచి
ఎదిగారు చట్టం ఎవరికీ చుట్టంకాదు సంధ్య థియేటర్
ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం సరైంది
కాదు రేవతి కుటుంబాన్ని పరామర్శించాల్సింది
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు మీడియాతో
ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ చిట్‌చాట్

మన తెలంగాణ/అమరావతి: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అ న్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేద ని అలా చేశారని తాను అనుకోవడం లేద ని, రేవంత్ రెడ్డి వీటన్నింటికీ మించిన నా యకుడన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారని, మరి మనం రేవంత్ రెడ్డిని ఎ లా తప్పుపడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. అల్లు అర్జున్ తరఫు న బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉం టే బాగుండేదన్నారు. అప్పుడు రచ్చ అవకుండా ఉండేదని, ఈ ఘటనలో రేవతి చ నిపోవడం తనను కలచి వేసిందని, గోటి తో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని పవన్ అన్నారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో చి ట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. అల్లు అ ర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్ప థం లోపించిందని పవన్‌కల్యాణ్ అన్నా రు. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అది చేయకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందన్నారు.

రేవంత్ రెడ్టిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని, సీఎం హోదాలో ఆయన స్పందించారన్నారు. రేవంత్ రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్ననాటి నుంచీ తెలుసని, అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కానీ కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని, కింద నుంచి ఎదిగారన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని తెలిపారు. అక్కడ బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారన్నారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు. తాము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశామని, ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టనంటే వారు ముందు ప్రజల భద్రత గురించి ఆలోచన చేస్తారని చెప్పారు. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు.

చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారని, తనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. ఈ విషయంలో థియేటర్ సిబ్బంది అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేదని, ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసిందన్నారు. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారన్నారు. ఈ ఘటనలో తన వల్ల చనిపోయారనే ఆవేదన అర్జున్‌లో ఉంటుందని, వెళ్లి ఆ బిడ్డ కోసం మేమున్నామనే భరోసా ఇవ్వాలన్నారు. సినిమా అంటే టీం. అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని తన అభిప్రాయమని అన్నారు.

క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి

సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పవన్‌కళ్యాణ్ అన్నారు. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడాలని, రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయని, విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయని, ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలని, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలని, అప్పుడే మంచి సినిమాలు సాధ్యమని పవన్‌కల్యాణ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News