- Advertisement -
అమరావతి: ఢిల్లీ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మోడీ లక్ష్యాలను అందుకోవడంలో ఢిల్లీ పాత్ర కీలకమని ప్రశంసించారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించడంతో జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం శుభపరిణామం అని కొనియాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బిజెపి హామీలను ప్రజలు నమ్మారని, మిత్రపక్ష నాయకులకు అభినందనలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 33 స్థానాల్లో గెలుపొందగా 14 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఆప్ 18 నియోజకవర్గాలలో విజయం సాధించగా ఐదు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- Advertisement -