అమరావతి: పవన్ కల్యాణ్ అభిమాన్లలో కొందరు “పిఠాపురం ఎంఎల్‌ఎ గారి తాలూకా” అంటూ బైక్ నంబర్ ప్లేటుపై రాసుకోవడంతో ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సరదాగా స్పందించారు. ఎవరూ పిఠాపురం ఎంఎల్‌ఎ తాలూకా అని నంబర్ ప్లేట్ పెట్టుకోవద్దని, వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని, అప్పుడు తన పేరు మీదికి వస్తుందని ఫన్నీగా అన్నారు. బైక్ రేసింగ్‌లు చేసుకోవాలనుకునే వారికి తన రెండు ఎకరాల స్థలంలో చేసుకోవచ్చని చెప్పారు. తన స్థలాన్ని రేసింగ్‌లకు అనుకూలంగా మార్చుతానని వివరణ ఇచ్చారు. బైక్ రేసింగ్‌లకు అవసరమైన సేఫ్ గార్డులు, హెల్మెట్లు, ఇతర రక్షణ పరికారాలు అందిస్తానని తెలియజేశారు. అక్కడ ఉన్నవారు జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తనకు సినిమాలు చేసే సమయం ఉంటుందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తనని నిర్మాతలు క్షమించాలని కోరారు. మూడు నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు సినిమాలు చేస్తామని, మనం ఒజి అంటే ప్రజలు క్యాజీ అంటారన్నారు. మూడు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటానని, కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్‌కు వస్తానని పేర్కొన్నారు. నిర్మాతలను క్షమాపణలు కోరుతున్నానని, నిర్మాతలు ఆ మేరకు అడ్జస్ట్ చేసుకోవాలన్నారు.