- Advertisement -
తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇండియాకి తిరిగొచ్చారు. కుమారుడితోపాటు పవన్ దంపతులు హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో పలు టెస్టులు చేసిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. దీంతో కుమారుడితోపాటు పవన్ దంపతులు ఇండియాకు తిరిగొచ్చారు.
- Advertisement -