Monday, December 23, 2024

షర్మిల పార్టీపై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సంస్థను నడపడానికి గణనీయమైన ఆర్థిక నిల్వలు సరిపోవన్నారు. అధికారం కోసం మార్గం సులభంగా ప్రయాణించదగినది కాదని నొక్కి చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇటీవల తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. షర్మిల పార్టీ పెడితే శుభాకాంక్షలు చెప్పి ఆహ్వానించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పుడు తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని ఈ మధ్యే వింటున్నామన్నారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదన్నారు. సైద్దాంతిక బలం ఉంటేనే పార్టీని నడపగలం పేర్కొన్నారు. మనం అర్జెంటుగా అధికారంలోకి రావాలనుంటే అప్పుడే నేను కాంగ్రెస్ లోకి పార్టీని వెళ్లేవాడిననని స్పష్టం చేశారు. సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే దాని కోసం చచ్చిపోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News