Sunday, January 19, 2025

మూడు పెళ్లిళ్లపై ప్రత్యర్థుల విమర్శలకు పవన్ చెక్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో దిగ్విజయంగా సాగుతోంది. సినిమా షూటింగ్‌లకు బ్రేకు ఇచ్చి మరీ పవన్ వారాహి యా రథంలో రాష్ట్రమంతా పర్యటిస్తూ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు మాత్రం దాన్నే టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం పవన్‌ను ప్రధానంగా మూడు పెళ్లిళ్లు అనే అంశంపైనే టార్గెట్ చేశారు. పవన్ సతీమణి అన్నా లెజ్నీవా ఈ మధ్య ఎక్కడా పబ్లిక్ ఫంక్షన్‌లో కనిపించడకపోవడంతో పవన్ మళ్లీ విడాకులు తీసుకుంటున్నారన్న వదంతులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో..తనపై వస్తున్న వదంతులకుచెక్ పెడుతూ పవన్ తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో తన భార్య లెజ్నీవాతో కలసి పూజకు హాజరైనప్పటి ఫోటోను పవన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాంప్రదాయ దుస్తులతో పవన్ సతీసమేతంగా కనిపిస్తున్న ఈ ఫోటో చూసి ఆయన అభిమానులు సంబర పడుతున్నారు. పవన్ దంపతులు కలిసే ఉన్నారనడానికి ఇదే తిరుగులేని సాక్షమని, దీంతోనైనా ప్రత్యర్థుల నోళ్లు మూతపడతాయని పవన్ ఫ్యాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2013లో పవన్ రష్యా జాతీయురాలైన అన్నా లెజ్నీవాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పొలేనా అంజన పవనోవా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News