Sunday, January 19, 2025

మళ్లీ మోదీయే ప్రధాని కావాలి: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీకి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీసీల ఆత్మగౌరవ సభలో వేదికపైనుంచి ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని, సామాజిక తెలంగాణ ఏర్పడాలని ఆకాంక్షించారు. చాలామంది నాయకులు బీసీలను నోటి మాటలతో ప్రేమిస్తారనీ, కానీ ప్రధాని మోదీ నోటిమాటతో కాకుండా సీట్లిచ్చి బీసీలను ప్రేమించారని కొనియాడారు.

మరోసారి మోదీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం అద్భుతమైనదనీ, దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్నమైన పథకాలను మోదీ తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒక దశాబ్దంలోనే సాధించారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News