Tuesday, April 1, 2025

ముందు బాధ్యత.. ఆ తర్వాతే వినోదం: పవన్

- Advertisement -
- Advertisement -

సినిమాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న
డిప్యూటీ సీఎం పవన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ‘ఓజీ’ అంటూ అభిమానుల నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ.. “ముందు బాధ్యత.. ఆ తర్వాతే వినోదం అన్నారు. సినిమాల్లో ఎవరితోనూ నేను పోటీ పడను. ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు.  బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకుంటా. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాకే వినోదాలు, విందులు చేసుకుందాం” అని పవన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News