Sunday, January 19, 2025

గ్రామంలో పెట్టే ఖర్చు, జరిగే పనులపై డిస్‌ప్లే బోర్డులు ఉండాలి: పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజలు తమ పంచాయతీల్లో ఏం పనులు జరగాలో వాళ్లే తీర్మానం చేసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామంలో ఎంత ఖర్చు పెట్టాం, ఏయే పనులు జరుగుతున్నాయో డిస్‌ప్లే బోర్డులు ఉండాలన్నారు. పరిపాలన వేరు.. పాలిటిక్స్‌ వేరని డిప్యూటీ సీఎం చెప్పారు. కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న
డిప్యూటీ సీఎం పవన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

“చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం.. అందుకే కలిసి పోటీ చేయాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం.. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి.. టీడీపీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయం వల్ల ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా ఉండాలి.. మాతో పాటు అధికారులు కూడా నిజాయితీగా ఉండాలి.. లంచం తీసుకున్న అధికారిపై వెంటనే చర్యలకు ఆదేశించాం” అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News