Friday, December 20, 2024

చీమలపాడు బాధితులకు పవన్ కళ్యాణ్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన అంగోతు మంగు కుటుంబ సభ్యులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గురువారం వీడియో కాల్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రమాదంలో తమ తండ్రిని కోల్పోయి ఒక రోజు గడిచినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఏ విధమైన సహాయం అందలేదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుడి కుమారులు ఉమేష్, గణేష్‌లు పవన్ కళ్యాణ్‌ను అభ్యర్థించారు.

జరిగిన సంఘటన చాలా బాధకరమని, కుటుంబ పెద్దను కోల్పోతే కలిగే బాధను అర్థం చేసుకోగలనని, బాధిత కుటుంబాలు అందరికీ న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చీమలపాడు ప్రాంతాన్ని జనసేన తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్‌గౌడ్ , రాష్ట్ర నాయకులు తాళ్ళూరి రామ్ , రాధారం రాజలింగం సందర్శించిన అనంతరం మరణించిన వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులు కావ్య, శిరీష, రామకృష్ణ, రవీందర్, రాజేష్, నరేష్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News