Saturday, April 26, 2025

నాదెండ్లను వదలకపోతే పోరాటం తప్పదు: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

విశాఖ పోలీసులు అరెస్టు చేసిన తమ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ను తక్షణం వదిలిపెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నాదెండ్లతోపాటు మిగిలినవారినీ వదలిపెట్టాలని, లేకపోతే తాను విశాఖ వచ్చి పోరాటం చేస్తానని హెచ్చరించారు. విశాఖలో టైకూన్ జంక్షన్ వద్ద మూసేసిన రోడ్డును తెరవాలంటూ నాదెండ్ల నేతృత్వంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు నాదెండ్లతోసహా మిగిలినవారిని కూడా అరెస్టు  చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీకి చెందిన ఒక ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం ఉందన్న కారణంతోనే రోడ్డును మూసేశారని ఆయన ఆరోపించారు. దీనిపై పోరాడితే అరెస్టు చేయడం అన్యాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News