- Advertisement -
ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళకి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే దాదాపు 50కోట్లకు మించి భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మరికొన్ని రోజుల్లో ఈ మహా ఉత్సవం ముగియనుడంతో భక్తులు పవిత్ర స్నానం చేస్తేందుకు కోకొల్లలుగా వెళ్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంతో మంది ప్రముఖులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. కుంభమేళలో పాల్గొన్నారు. ఆయన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్‌తో ప్రయాగ్‌రాజ్ వెళ్లిన ఆయన పవిత్రస్నానం చేశారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
- Advertisement -