Friday, December 20, 2024

రోజుకు రెండు కోట్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్‌ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమా రిలీజవుతుందంటే అభిమానులకు ఒక పండగే. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్‌ చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిధరమ్‌ తేజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.కాగా గతకొన్ని రోజులుగా ఈ సినిమాకు పవన్‌ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేన 10వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమావేశంలో తన పారితోషికం గురుంచి చెప్పాడు. సినిమాకు 22 రోజులు కాల్షీట్లు ఇచ్చానని, సినిమాకు నేను తీసుకునే డబ్బు రోజుకు రెండు కోట్లని, ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటానని ఆయన అన్నారు. ఏప్రిల్‌ నాటికి పవన్‌ షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది.2015లో వచ్చిన గోపాల గోపాల సినిమా తర్వాత పవర్ స్టార్ రెండోసారి ‘దేవుడు’ పాత్రలో నటిస్తున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News