Sunday, January 19, 2025

రేపు విశాఖలో పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ భేటీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రెండు రోజుల పాటు విశాఖపట్నం పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. శుక్రవారం, శనివారం విశాఖలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బెంగుళూరు నుంచి నేరుగా విశాఖ వస్తున్న ఆయన శుక్రవారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శుంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం నరేంద్ర మోడీతో పవన్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ సమావేశం కానున్నారు.

Pawan Kalyan to meet PM Modi in Vizag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News