Sunday, December 22, 2024

రెండు రీమేక్‌ల్లో పవన్?

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan to sign 2 remake movies?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి మరో రీమేక్‌లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఒరిజినల్ కథలతో హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘వినోదయ సీతమ్’ అనే ఓ తమిళ్ రీమేక్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఓటీటీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ అంగీకారం తెలిపినట్లుగా కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. మాతృకను డైరెక్ట్ చేసిన సముద్రఖని చేతిలోనే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు పెట్టారట. పవన్ రీమేక్ సినిమాలో మార్పులు చేర్పులు చేసే బాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారని.. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వచ్చింది. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా బ్యానర్‌లో ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది.

పవన్ ముందుగా ‘హరిహర వీరమల్లు’ సినిమాని పూర్తి చేయాలని భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే అంతలోనే తమిళ్‌లో ఘనవిజయం సాధించి తెలుగులోకి ‘పోలీసోడు’ పేరుతో డబ్బింగ్ చేయబడిన ‘తేరి’ చిత్రాన్ని పవన్ రీమేక్ చేయనున్నట్లు తెలిసింది. పవన్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్న హరీష్.. ఆయనతో ప్రస్తుతం ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు హరీష్.. ‘తేరి’ స్టోరీని తన స్టైల్‌లోకి మార్చి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే వినోదయ సీతమ్, తేరి రీమేక్స్‌లో పవన్ ముందుగా దేనికి ఓటేస్తారనేది చూడాలి.

Pawan Kalyan to sign 2 remake movies?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News