Friday, December 20, 2024

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. క్యాంప్ కార్యాలయంలోని రెండో బ్లాకులో బుధవారం ఉదయం వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారులు ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మొదట గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో పవన్ భేటీ కానున్నారు.  కాగా.. పవన్ కల్యాణ్ తోపాటు వంగలపూడి అనిత రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News