Thursday, December 19, 2024

వైసిపి నేతలకు పోయేకాలం వచ్చింది: పవన్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: నన్నేదో చేయడానికి రెక్కీలు చేస్తారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంగళగిరి ప్రాంతం ఇప్పటం గ్రామంలో టిడిపి, జనసేన కార్యకర్తల ఇళ్లు, పహరీల గొడలను వైసిపి ప్రభుత్వం కూల్చి వేసిన సందర్భంగా ఆ గ్రామంలో పవన్ పర్యటిస్తున్నారు. వైసిపి నేతలపై పవన్ ఘాటు విమర్శలు చేశారు. వైసిపి నేతలకు దమ్ముంటే తన చొక్కా టచ్ చేయాలని సవాలు విసిరారు. వైసిపి నేతలకు పోయేకాలం వచ్చిందని, భవిష్యత్‌లో ఒక్కొక్కడి సంగతి తేలుస్తామని పవన్ హెచ్చరించారు. ప్రతి పక్షాల పార్టీలకు చెందిన కార్యకర్తల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. నలుగురు కిరాయి మూకలు భయపడే ప్రసక్తే లేదని, ఎంత మంది వచ్చిన వెనకడుగు వేయబోమని పవన్ హెచ్చరించారు. ఎంత మందితో ఎన్ని రెక్కీలు నిర్వహించని భయపడబోనని, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా సజ్జల రామకృష్ణా రెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News