- Advertisement -
కాకినాడ: గొల్లప్రోలులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఏలేరు కాలువకు గండిపడి వారం రోజులుగా స్థానికులు వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకుని అక్కడి జగనన్న కాలనీ చేరుకున్నారు.
వరద ప్రవాహం ఎక్కువ ఉన్నప్పటికీ పడవలో ప్రయాణించి బాధితులను కలిసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని, వరదు బాధితులను ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాక జిల్లా అధికారులతో మాట్లాడి బాధితులకు తక్షణ సాయం అందించాలని సూచించారు.
ఏలేరు దిగువన ఉన్న సుద్ధగడ్డవాగుకు వరద పోటెత్తడంతో అక్కడి కాలనీలన్నీ మునిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో కిర్లంపూడి, పిఠాపురం, జగ్గంపేట ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
- Advertisement -