Friday, December 20, 2024

సెప్టెంబర్ 5 నుంచి” ఉస్తాద్ భగత్ సింగ్ “కీలక సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారి కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన ‘గబ్బర్ సింగ్’ ను అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో స్పెషల్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అలరించబోతుంది. ఈ సినిమా మాసీవ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ లెంతీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News