Monday, December 23, 2024

రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకుని వెళ్తున్నా: పవన్

- Advertisement -
- Advertisement -

తాడేపల్లిగూడెం: రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకుని వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన నాయకులు వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భ పవన్ మాట్లాడారు. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని, మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడే పని లేదని, అద్భుతాలు చేయాలని రాజకీయాల్లో రాలేదని, పేదల జీవితాలు మార్చాలని వచ్చానన్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాడానికే పోరాడుతున్నానని, తానూ, తన కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కొవాలని పవన్ ఎదురు ప్రశ్నించారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని కుటుంబానికి పణంగా పెట్టి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికి అని పవన్ ప్రశ్నించారు. సమాజంలో అవినీతి అనేది నిత్యకృత్యమైపోయిందని, తన అభిమాని అయినాసరే… మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.

Also Read: ప్రేమజంటను చంపేసి… చెట్టుకు వేలాడదీశారు… ముగ్గురు అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News