Wednesday, January 22, 2025

నేటి నుంచి మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

విశాఖ: మూడో విడత వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సిద్ధమయ్యారు. గురువారం నుంచి విశాఖపట్నంలో పవన్ మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.ఈ యాత్రను పర్యవేక్షించేందుకు జనసేన పార్టీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. వారాహి యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం జగదాంబ సెంటర్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.

అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు. కాగా, మూడో విడత వారాహి యాత్ర ఈ నెల 19 వరకు కొనసాగనుంది. ఇప్పటికే రెండో విడతల యాత్రతో పవన్ పలు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News