Sunday, December 22, 2024

చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ తాజా రాజకీయాలపై చర్చ
త్వరలో మరోసారి కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం
రెండు పార్టీలు కలిసే జగన్ సర్కారుపై పోరుకు కార్యాచరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. శనివారం సాయంత్రం నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి మరో సారి భేటీ కావాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య శాఖలో ఈ మేరకు నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం. కాగా టిడిపి – జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలు ప్రతిపాదనకు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ తాజా రాజకీయాలపై చర్చించుకున్న వారు త్వరలోనే మరో సారి భేటీ కావాలని చంద్రబాబు నాయుడు, పవర్ కళ్యాణ్‌లు నిర్ణయం తీసుకున్నారు. ఏపి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కోసం దాదాపు ఆరు అంశాలను జనసేన పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జనసేన సూచిన్తున్న ఆరు అంశాలతో పాటు మరో నాలుగు చేర్చి మొత్తం పది అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఈ సందర్భంగా జనసేన నేత పవన్ చంద్రబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. అయితే ఆలస్యమైనా పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించుకుందామని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

అంతకు ముందు ఏపిలో క్షేత్ర స్థాయిలో టిడిపి, జనసే చేపట్టాల్సిన  కార్యక్రమాలపైనే సూదీర్ఘంగా వారు చర్చించినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబుపై సిఐడి పెడుతున్న వరుస కేసులపైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య చర్చ జరిగింది. ముందుగా మినీ మెనిఫెస్టోనా, పూర్తిస్థాయి మేనిఫోస్టోనా? అన్న అంశంపైన తర్జన భర్జనలు పడినట్లు తెలుస్తోంది. ఏతా వాతా త్వరలో మరో సారి భేటీ కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News