Friday, December 27, 2024

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అనకాపల్లి పట్టణంలో నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. ఢిల్లీ పర్యలన ముగించుకున్న పవన్‌కళ్యాణ్ నేరుగా విశాఖపట్నంకు ప్రత్యేక విమానంలో వచ్చారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో సోమవారం అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News