Thursday, December 19, 2024

వాల్తేర్ వీరయ్యతో హరిహర వీర మల్లు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘బాస్ పార్టీ సాంగ్’ బుధవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దాని కంటే ముందు చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. ఈ పాట చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్‌ని చూపించింది. ఇక ’వాల్తేర్ వీరయ్య’ సెట్‌లోకి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన ‘హరిహర వీరమల్లు’ చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నంతో కలిసి హైదరాబాద్‌లోని సెట్‌ను సందర్శించారు. ‘బాస్ పార్టీ సాంగ్’ను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్‌పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక ప్రోమోలో చిరంజీవి గళ్ళ లుంగీ, కలర్‌ఫుల్ షర్ట్‌లో తనదైన స్టయిల్ లో నడుస్తూ మెగా మాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలో కనిపించిన మెగా వాకింగ్ స్టయిల్ ఫ్యాన్స్‌ని మైమరిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మాస్‌ని ఆకట్టుకొనే అదిరిపోయే ట్యూన్‌ని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి ఆలపించారు. మాస్ సాంగ్స్ స్పెషలిస్ట్ శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్. లిరికల్ వీడియో బుధవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pawan Kalyan visits Chiranjeevi at Waltair Veerayya Sets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News