Monday, December 23, 2024

రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తన ప్రచార రథం వారాహికి వాహన పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి బృందావన్ గార్డెన్స్‌లో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలతో చర్చించి వారికి పవన్ కళ్యాణ దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 4 గంటలకు ధర్మపురికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించనున్నట్లు జనసేన నేతలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News