హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్షమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. బుధవారం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆశిస్సులను తీసుకున్న అనంతరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి నుంచి జై భవాని అంటూ అమ్మవారి పేరు స్మరించారు. అనంతరం ప్రసంగిస్తూ రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
డుర్గమ్మ సేవలో వపన్ కళ్యాణ్
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ పిఎసి చైర్మన్ నాదేండ్ల మనోహర్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం నేరుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. పవన్ కళ్యాణ్‌కు ఆలయ ఈఓ భ్రమరాంభ, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకున్న పవన్ కళ్యాణ్, మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వాదం అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు.
ఎపిలో రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం: పవన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -