Monday, December 23, 2024

పవన్ పై మంత్రి జోగి ఘాటు వ్యాఖ్యలు.. ఆందోళన చేపట్టిన జనసేన

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎపి మంత్రి జోగి రమేష్‌పై చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మంత్రి జోగి రమేష్‌ కు వ్యతిరేకంగా జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగి ఆందోళన చేపట్టారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనండంతో జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, నిన్న(సోమవారం) పవన్ పై మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఓ పిచ్చికుక్క అని.. పవన్ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తాడని నిప్పులు చెరిగారు. మార్చటం పవన్ కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News