Saturday, February 22, 2025

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని పవన్ కొనియాడారు. ఎపి అభివృద్ధి గురించే చంద్రబాబు ఆలోచన చేస్తారన్నారు. వైకాపా పెట్టిన కేసుల్లో జైల్లో ఉన్నా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదని పేర్కొన్నారు. ఎపి రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని పవన్ తెలిపారు. అటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News