Tuesday, April 1, 2025

నటసింహం షోలోకి పవర్ స్టార్ ఎంట్రీ.. అదుర్స్

- Advertisement -
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న బిగ్గెస్ట్ టాక్ షో ‘ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 2’ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సెట్స్ కు చేరుకున్నారు. స్వయంగా బాలయ్య, పవన్ కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షాలో పవన్, బాలయ్య మధ్య జరిగే సంభాషణను చూసేందుకు ఇద్దరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ షూట్ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడు. ఈ ఎపిసోడ్ కొత్త సంవత్సరం స్పెషల్‌గా రానున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌లో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఫోన్ కాల్ ద్వారా జాయిన్ అవుతారని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News