Wednesday, January 22, 2025

పవన్ కళ్యాణ్ యాత్ర కోసం మరో 6 కొత్త వాహనాలు సిద్ధం..

- Advertisement -
- Advertisement -

 

పవన్ కళ్యాణ్ యాత్ర కోసం మరో 6 కొత్త వాహనాలు సిద్ధం
ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో వాహనాలకు రిజిస్ట్రేషన్
పవన్‌కళ్యాణ్ రాకతో సందడిగా మారిన ఆర్టీఓ కార్యాలయం
మనతెలంగాణ/హైదరాబాద్: పవన్ కళ్యాణ్ యాత్ర కోసం మరో 6 కొత్త వాహనాలు సిద్ధమయ్యాయి. జనసేన పార్టీకి సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి గురువారం పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆర్టీఓ కార్యాలయంలో సందడి నెలకొంది. ఇప్పటికే వారాహి వాహనానికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ చేయగా గురువారం మరో 6 వాహనాలను ఖైరతాబాద్ ఆర్టీఓ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు.

రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్లో రెండు స్కార్పియో వాహనాలు, ఒక టయోటా వెల్ఫేయిర్, ఒక జీప్, ఒక బెంజ్, ఒక చిన్న తరహా వాహనానికి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటో దిగి సంతకం చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఓ రాంచందర్ ఈ రిజిస్ట్రేషన్‌ను జరిపించారు. డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ పాపారావు పవన్‌కళ్యాణ్‌ను దగ్గరుండి ఈ ప్రక్రియను పూర్తి చేయించారు. ఎంవిఐ శ్రీనుబాబు కొత్త వాహనాలకు సంబంధించి పలు డాక్యుమెంట్లను, వాహనాలను తనిఖీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News