Sunday, January 19, 2025

రిపబ్లిక్ డే ట్రీట్‌గా..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపు రెండు సంవత్సరాలుగా రూపొందుతోంది. షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కావస్తోంది.

తాజాగా ‘హరి హర వీర మల్లు’ టీజర్ పై నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ ఇచ్చారు. రిపబ్లిక్ డే ట్రీట్‌గా జనవరి 26న సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఏఎమ్ రత్నం ధృవీకరించారు. ఈ చిత్రంలో, పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ లాంటి పాత్రను పోషిస్తున్నాడు.

గత ఏడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హరిహర వీర మల్లు చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీలు ఔరంగజేబ్, అతని సోదరి రోషనారాగా కనిపించనున్నారు. గోల్డెన్ గ్లోబ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ఈ సినిమా థియేటర్ల లోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News