Monday, January 20, 2025

‘ఓజి’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

సరిగ్గా పదకొండేళ్ల క్రితం అనగా 2013 సెప్టెంబర్ 27న విడుదలైన పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది మూవీ అతి పెద్ద విజయం అందుకోవడం జరిగింది. ఇక అదే డేట్‌కి ఓజి సినిమా కూడా రిలీజ్ ఆవుతుండడంతో మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద పవర్‌స్టార్ చరిత్రను పునరావృతం చేయడం ఖాయం అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News