‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు(బుధవారం) నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి షెడ్యూల్ జరగనుంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
- Advertisement -