- Advertisement -
సింగపూర్: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. పవన్ కల్యాణ్ హుటాహుటిన సింగపూర్‌కు బయలుదేరానున్నారు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరగడంతో బాబు కాళ్లు, చేతులు కాలిపోయాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బాబు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాబును స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పవన్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. రేపటి నుంచి జరిగే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని పవన్ సింగపూర్ పయనం కానున్నారు. ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం గిరిజనులను కలిసి వెళ్తానని ప్రవన్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన అనంతరం సింగపూర్ కు బయలు దేరుతానని వివరణ ఇచ్చారు.
- Advertisement -