- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదానీ, హిండెన్‌బర్గ్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై అస్సాం పోలీసులు పవన్ ఖేరాను గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేయగా వెంటనే బెయిల్ కోసం ఖేరా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఖేరాకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, తనపై ఉత్తర్ ప్రదేశ్, అస్సాంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను జతచేయాలన్న ఖేరా విజ్ఞప్తిపై ఆ రెండు రాష్ట్రాల సమాధానాలు కోరుత సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
- Advertisement -