- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గురువారం అరెస్టయి సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఉదంతంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం పెదవి విప్పారు. పవన్ ఖేరా బేషరతుగా క్షమాపణ చెప్పినప్పటికీ ఆ వ్యవహారం అక్కడితో ముగియలేదని శర్మ అన్నారు. ఖేరాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అస్సాం పోలీసులు దీనిపై చట్టపరంగానే ముందుకు సాగుతారని ఆయన చెప్పారు. అంతేగాక ఖేరాకు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని సూచించేలా ఆ ఉత్తర్వు కాపీని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- Advertisement -