Monday, December 23, 2024

సెబీ చీఫ్ రెండు జీతాలు తీసుకుంటోందా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చీఫ్ మాధబి పురీ బుచ్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కూడా వేతనం తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సోమవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికే వస్తుందంటూ వ్యాఖ్యానించారు.

ఒక కంపెనీలో పనిచేస్తూ ఒక చోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ ఖేడా అన్నారు. సెబీ చీఫ్ విషయంలో అలా జరగడం లేదన్నారు.సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న మాధబీ పురీ బుచ్ ఐసిఐసిఐ బ్యాంక్, ప్రుడెన్షియల్ నుంచి వేతనం అందుకుంటున్నారని ఆరోపించారు. 2017-2024 మధ్య ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లు కూడా అందుకున్నారని పేర్కొన్నారు.  ఇలా వేతనం అందుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. గత ఏడేళ్ల కాలంలో ఆమె సుమారు రూ. 16 కోట్లకు పైగా వేతనం అందుకొన్నారని ఆరోపించారు. పారదర్శకంగా విచారణ జరపాలని కూడా ఖేడా డిమాండ్ చేశారు. వేతనం అందుతుండడం వల్లే ఐసిఐసిఐ బ్యాంక్ పై పలు విచారణలు నిలిచిపోయాయని ఆరోపించారు. సెబీ చీఫ్ నియామకంలో కీలకమైన కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీ కీలక వ్యక్తులైన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లను పవన్ ఖేడా తప్పుబట్టారు.

Madhabi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News