Wednesday, January 22, 2025

పవన్ పార్టీకి గుర్తులేదు: నారాయణ స్వామి

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది వారాహి కాదని, నారాహి యాత్ర అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో పవన్ కులాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పాలనతో కాపులకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్‌ఫండ్ మోసాలపై రామోజీ రావును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నారాయణ స్వామి అడిగారు. పవన్ కల్యాణ్ పార్టీకి గుర్తే లేదని చురకలంటించారు.

Also Read: బిఆర్‌ఎస్‌పై అసదుద్దీన్ ఒవైసి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News