Sunday, December 22, 2024

పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు: ముద్రగడ పద్మనాభం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్ లా మారింది. చాలా మంది నేతలు ఆ నియోజకవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతాడని ముద్రగడ పద్మనాభం జోస్యం చెప్పారు. ఒక ఎంపి, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే తాను అతని దగ్గరికి వెళ్లాలా.. చిరంజీవి ఓడిపోయాడు.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడని ముద్రగడ గుర్తుచేశారు. ఉద్యమం వలన తాను నష్టపోయానని చెప్పిన ఆయన తన శత్రవులతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తాడని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను చాలా ఇబ్బందులు పెట్టాడని ఆరోపించారు. జగన్కు.. పవన్కు చాలా తేడా ఉందన్నారు ముద్రగడ. 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు.. 20 సీట్ల కోసం పవన్కు నేను ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ఓటమి కోసం పని చేస్తానని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News