‘వారాహి’ వాహనానికి వారం క్రితమే రిజిస్ట్రేషన్
వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించాం
అన్ని నిబంధనలు ఉన్నాయి
రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384
తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ పాపారావు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి సంబంధించి గతంలోనే రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలంగాణ రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని కొన్ని మీడియాలో వచ్చిన వార్తలపై తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ పాపారావు సోమవారం పేర్కొన్నారు. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, వారం క్రితమే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని వెల్లడించారు. వారాహి వాహనం రంగు ఎమరాల్ గ్రీన్ అని ఆయన స్పష్టం చేశారు.
వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని, అన్ని నిబంధనలు ఉన్నాయని, వాహనం రిజిస్ట్రేషన్ కోసం చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని ఆయన తెలిపారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 అని ఆయన వెల్లడించారు. కాగా, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉందని, ఈ వాహనం రిజిస్ట్రేషన్ రవాణాశాఖ అనుమతి ఇవ్వడం కష్టమని వైసిపి నాయకులు ఆరోపించిన నేపథ్యంలో పాపారావు దానిపై క్లారిటీ ఇచ్చారు.