Sunday, April 27, 2025

పవన్ చిన్న కుమారుడి హెల్త్ అప్డేట్.. మరో 3 రోజులు ఆస్పత్రిలోనే

- Advertisement -
- Advertisement -

సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో నిన్న సింగపూర్ వెళ్లిన పవన్.. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని.. ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. టెస్టులు చేసేందుకు మరో 3 రోజులపాటు ఆస్పత్రిల్లోనే ఉంచనున్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు సమాచారం. కాగా, నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా.. మరోె 30 విద్యార్థులకు గాయాలైనట్లు వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News