Sunday, December 22, 2024

పాట్నా సమావేశంలో ప్రధాని పదవిపై చర్చించలేదు: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణె: రానున్న లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గత వారం పాట్నాలో సమావేశమైన ప్రతిపక్ష నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి పదవిపై ఎటువంటి చర్చ జరగలేదని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం తెలిపారు. మహారాష్ట్రలోని బారామతి పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, మతతత్వ శక్తులను ప్రోత్సహించడానికి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న చర్యల గురంచి ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు.

ప్రతిపక్షాల పాట్నా సమావేశంపై బిజెపి చేస్తున్న విమర్శలపై పవార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాల సమావేశం పట్ల బిజెపి కలత చెందుతోందని ఆయన విమర్శించారు. బిజెపి నాయకులకు రాజకీయ పరిపక్వత కొరవడిందని ఆయన వ్యాఖ్యానించారు.

గత శుక్రవారం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మందికి పైగా నాయకులు పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిపై సమైక్యంగా పోరాడాలని ఈ సమావేశంలో ప్రతిపక్షాల నాయకులు నిర్ణయించారు. తమ విభేదాలను పక్కనపెట్టి, ఇచ్చి పుచ్చుకునే వైఖరితో ఉమ్మడి అసెండా, రాష్ట్రాల వారీగా వ్యూహాలతో వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిపై పోరాడతామని ఉమ్మడి విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష నాయకులు ప్రకటించారు.
ప్రధాని పదవిని ఆశిస్తున్న 19 మంది అనాయకులు సమావేశంలో పాల్గొన్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా అవన్నీ పిల్ల చేష్టలని పవార్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.మతం పేరిట, కులం పేరిట సమాజంలో చిచ్చు పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన చెప్పారు. పాట్నా సమావేశాన్ని విమర్శిస్తున్న నాయకులమని చెప్పుకుంటున్న వారి ప్రకటనలను తాను చదువుతున్నానని ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్యంలో సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి కావాలా అంటూ ఆయన బిజెపి బీహార్ అధ్యక్షుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమావేశం జరుపుకోవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారని, తాను ముంబైలో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన చెబుతున్నారని, మీరు మాత్రం సమావేశం జరుపుకోవచ్చు, మేము జరుపుకుంటే ఆందోళన ఎందుకు అంటూ పవార్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News