Thursday, December 19, 2024

బదిలీ అయిన టీచర్ల వేతన బిల్లులను రెగ్యులర్ బిల్లులతో అనుమతించాలి

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్‌కు తపస్ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో అక్టోబర్‌లో జరిగిన బదిలీలలో స్థాన చలనం పొందిన ఉపాధ్యాయుల వేతన బిల్లులను రెగ్యులర్ బిల్లులతో అనుమతించాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ రామచంద్రమూర్తికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తపస్ నాయకులు మంగళవారం రామచంద్రమూర్తికి వినతిపత్రం అందజేశారు.

వరుస సెలవుల నేపథ్యంలో వేతన బిల్లులు సమర్పించేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించాలని కోరగా, అందుకు అంగీకరిస్తామని డైకెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ తెలిపారని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్‌లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News