Monday, December 23, 2024

రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించండి : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ డీలర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే వారు సమ్మె చేసే దుస్థితి నెలకొందన్నారు. కేంద్రం ఉచితంగా బియ్యం పంపినా పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. డీలర్లకు కేంద్రం సకాలంలో కమీషన్ చెల్లిస్తున్నా దానిని రాష్ట్ర ప్రభుత్వ సొంతానికి వాడుకుంటోందని ఆరోపించారు.

తక్షణమే డీలర్ల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోంది. వడ్ల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటమాడుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News