Thursday, July 4, 2024

యాప్‌ల ద్వారా నోపే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గుగుల్ పే, ఫోన్‌పే, పెటిఎం, అమెజాన్ వంటి థర్డ్‌పే యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా…? అయితే ఈ నెల నుంచి ఆ చెల్లింపులకు ఇక ఫుల్‌స్టాప్ పడింది. తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులు ఇక టిజిఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్, లేదా మొబైల్ యాప్ ద్వారా మా త్రమే విద్యుత్ బిల్లుల చెల్లించాలని సూచించింది. ఈ మేరకు టిజిఎస్‌పిడిసిఎల్ విద్యుత్ వినయోగదారులకు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ట్విట్టర్ లో ప్రియమైన వినియోగదారులా రా, ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్లు అనగా ఫో న్‌పే, పెటిఎం, అమెజాన్ పే, గుగూల్‌పే, బ్యాంకులు జూలై 1 నుండి టిజిఎస్‌పిడిసిఎల్‌కు సంబందించిన విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయని తెలిపింది.

అందువల్ల, వినియోగదారులందరూ టిజిఎస్‌పిడిసిఎల్ వెబ్‌సైట్, లేదా టిజిఎస్‌పిడిసిఎల్ మొబైల్ యాప్ ద్వారా నెలవారీ కరెంట్ బిల్లు చెల్లింపులను చేయవలసిందిగా అభ్యర్థించబడింది అని రాసుకొచ్చింది. కాగా గతంలో ఈ విద్యుత్ బిల్లులు గ్రామాల్లోని కరెంట్ ఆఫీస్ కి వెళ్లి చెల్లించేవారు. తర్వాత ఈ-సేవ, మీ-సేవలు అందుబాటులోకి వచ్చాక.. ఆన్ లైన్ సెంటర్లకు వెళ్లి చెల్లించడం మొదలు పెట్టారు. టెక్నాలజీ మరింత పెరిగాక ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు విద్యుత్ బిల్లులు సహా ఇతర బిల్లులు ఇంటి వద్ద నుంచే చెల్లించే సదుపాయం ఉంది. ఇటీవల సవరించిన ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఆన్ లైన్ సర్వీస్ ప్రొవైడర్లు విద్యుత్ బిల్లులను అంగీకరించడం నిలిపివేశాయి. దీంతో ఇప్పటినుంచి విద్యుత్ బిల్లులు కేవలం విద్యుత్ శాఖ కు చెందిన యాప్ ల ద్వారా లేదా నేరుగా విద్యుత్ శాఖకు చెందిన ఆఫీస్ ల వద్ద మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News