Monday, December 23, 2024

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని ఉపాధిహామీ జెఎసి ప్రతినిధులు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆయనను జెఎసి ప్రతినిధులు కలిశారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉపాధి హామీలో మొదటి స్థానంలో నిలవడంలో ఉపాధి హామీ ఉద్యోగుల పనితనం, ప్రతిభ కారణమని, వాళ్ల పనికి తగిన విధంగా వేతనాలు అందాలంటే, వాళ్లకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఉపాధి ఉద్యోగులకు న్యాయం జరిగేలా ఆలోచించి.. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఒప్పించాలని మంత్రిని వారు కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఉపాధి హామీ ఎపిఓల సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, గురుపాదం, నాగభూషణం, జెఎసి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News