Thursday, January 23, 2025

గౌతమ్ గంభీర్ నా వెంట పడ్డాడు:  ఎన్టీఆర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

వివాదాలను కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న నటి పాయల్ ఘోష్. గతంలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించి సంచలనం సృష్టించిన పాయల్ తాజాగా మరో వివాదానికి తెరతీసింది. ఈసారి క్రికెటర్లే తన వెంట పడ్డారని చెప్పుకొచ్చింది.

‘నేను, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఐదేళ్లపాటు డేటింగ్ చేశాం. తర్వాత మా దారులు వేరయ్యాయి. ఆ తర్వాత నేనెవ్వరినీ ప్రేమించలేదు. నాకు నచ్చిన వ్యక్తి ఇర్ఫాన్ మాత్రమే’ అంటూ ఇర్ఫాన్ ఫోటోతో ఆమె ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనానికి కారణమైంది. అంతటితో పాయల్ ఆగలేదు, తాను ఒకవైపు ఇర్ఫాన్ తో ప్రేమాయణం సాగిస్తుంటే, మరోవైపు క్రికెటర్ గౌతమ్ గంభీర్, హీరో అక్షయ్ కుమార్ తనవెంట పడ్డారని చెప్పుకొచ్చింది. గంభీర్ పదే పదే తనకు మెస్సేజ్ లు పంపేవాడనీ, మిస్డ్ కాల్స్ కూడా చేసేవాడనీ, ఈ సంగతి ఇర్ఫాన్ కు కూడా చెప్పాననీ పాయల్ పేర్కొంది. అయితే అక్షయ్ కుమార్ మాత్రం చాలా మంచి కుర్రాడని కితాబిచ్చింది. ఆయన తనతో ఏనాడూ మిస్ బిహేవ్ చేయలేదంది.

పాయల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కొందరు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ‘నలుగురి దృష్టిలో పడటానికి ఇంత నీచానికి దిగజారుతున్నావు, నీకింకేం పనిలేదా?’ అని ఒక నెటిజన్ పాయల్ పై మండిపడ్డాడు. ‘క్రికెటర్ ఇర్ఫాన్ కు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఐదేళ్ల తర్వాత అతనితో కలసి ఉన్న ఫోటోను పాయల్ ఇప్పుడు ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది?’ అని మరో నెటిజన్ నిలదీశాడు.

మొదటినుంచీ వివాదాల్లో ఉండటం పాయల్ కు అలవాటు. 2023 ప్రపంచ కప్ జరుగుతున్నప్పుడు పేస్ బౌలర్ మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటానంటూ ప్రకటించి, సంచలనం రేకెత్తించింది. ‘షమీ, నువ్వు ఇంగ్లీషు నేర్చుకో, నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నేను రెడీ’ అంటూ పాయల్ కామెంట్ చేసింది. ఈ అమ్మడు గతంలో ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ గా నటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News