Monday, January 27, 2025

గిరిజన అమ్మాయిగా పాయల్.. పాన్ ఇండియాగా ‘వెంకటలచ్చిమి’..

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలురేపి, ‘మంగళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రాజా, ఎన్‌ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. “వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నాం. గిరిజన అమ్మాయి యాక్షన్ రివెంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం” అని అన్నారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. “మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. డైరెక్టర్ ముని ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్‌కు నెక్స్ లెవెల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News