Monday, December 23, 2024

నవంబర్ 17న వస్తున్న ‘మంగళవారం’..

- Advertisement -
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’, ‘మహా సముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మంగళవారం’. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు వెళుతుంది. క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్ అందించే సినిమా ఇది” అని అన్నారు.

నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ”అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’లో తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు ‘మంగళవారం’తో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని విధంగా ఆయన సినిమా తీశారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆ మాటే చెబుతారు. 99 రోజులు షూటింగ్ చేశాం. అందులో 51 రోజులు రాత్రివేళల్లో చిత్రీకరణ చేశాం. మేం ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించాం. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులు సినిమాకు పని చేస్తున్నారు. ‘కాంతార’తో పాపులరైన అజనీష్ లోక్‌నాథ్ ఎక్స్‌ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తున్నారు. ‘విక్రమ్ వేద’, ‘కాంతార’, ‘విక్రాంత్ రోణ’, ‘సలార్’ తదితర చిత్రాలకు పని చేసిన, ‘రంగస్థలం’తో నేషనల్ అవార్డు అందుకున్న ఎంఆర్ రాజా కృష్ణన్ మా ‘మంగళవారం’ చిత్రానికి సౌండ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News